తొలి చినుకు స్పర్శను అనుభవిస్తూ అనుకుంట....నా ప్రియురాలి చేతి స్పర్శేమోనని....
ప్రతి చినుకును చూస్తూ అనుకుంట....ఏ చినుకులోనైన నా ప్రేయసి ఉందేమోనని....
సూర్య కిరణాలను తాకుతూ అనుకుంట...నా ప్రేయసి వెచ్చని కౌగిలి అని....
పసిపాప నవ్వుని చూస్తూ అనుకుంట....ఆ నవ్వులోని స్వచ్చతలో ఉందని...
ప్రతి రాత్రి చీకటిని చూస్తూ అనుకుంట....ఆ చీకటిలోని లోతులో నా ప్రేయసి ఉందేమోనని....
ఒంటరితనములో అనుకుంట....ఎదురుచుపులోనైన నా ప్రేయసి కనపడుతున్దేమోనని...
అందుకే ప్రతి క్షణం నా ప్రేయసికై ఎదురుచూస్తూ ఉంటా....ఒంటరిగా....